![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -304 లో.....శ్రీవల్లి జీన్స్ వేసుకొని స్టైల్ గా మోడ్రన్ గా తయారవుతుంది. తనని చూసి ఏంటే ఈ అవతారమని శ్రీలత అడుగగా.. రిచ్ వాళ్లు ఇలాగే ఉంటారంటూ మాట్లాడుతుంది శ్రీవల్లి. తన అవతారం చూసి సిరి నవ్వుకుంటుంది. మరొకవైపు సీతకాంత్ వస్తుంటే మాణిక్యం కన్పిస్తాడు. అల్లుడు ఎక్కడకి వెళ్లారంటూ అడుగుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది.
ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారని సీతాకాంత్ , రామలక్ష్మిలని మాణిక్యం అడుగగా.. నేను మా ఆయన ఆటో నడుపుతూ గౌరవంగా ఉంటున్నామని రామలక్ష్మి చెప్తుంది. నీకు ఎన్నోసార్లు మీ అమ్మ గురించి చెప్పాను కానీ నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు నా కూతురిని కష్టపెడుతున్నావని మాణిక్యం అనగానే.. నా భర్త ని ఎవరు బాధపెట్టిన నేను ఊరుకోను.. అది తండ్రి అయినా సరే అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాత్రి సీతాకాంత్ భోజనం చేయకుండా మాణిక్యం అన్న మాటలకి బాధపడుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతుంది. మాణిక్యం ఒక తాగుబోతులాగా మాట్లాడితే పట్టించుకోకపోయేవాడిని కానీ ఒక తండ్రిలా నా కూతురుని కష్టపెడుతున్నావని అడిగాడని సీతాకాంత్ అంటాడు. దాంతో సీతాకాంత్ ఆ బాధ నుండి బయటకు వచ్చేలా డైవర్ట్ చేస్తుంది రామలక్ష్మి.
ఆ తర్వాత మరుసటిరోజు ధన, సందీప్, శ్రీవల్లి, శ్రీలత లు మాట్లాడుకుంటారు. అయిదు కోట్లకు రెట్టింపు వచ్చే ప్లాన్ లో ఉంటే సీతాకాంత్ వచ్చి పాడు చేసాడని అనుకుంటారు. వాళ్ళకి సిరి సెటైర్ వేస్తుంటుంది. ఆ ఐడియా ఏదో బావగారిని మనమే అడుగుదామని సీతాకాంత్ లైవ్ ప్రోగ్రాం కి కాల్ చేస్తుంది శ్రీవల్లి. వాళ్లకు రామలక్ష్మి, సీతాకాంత్ లు కౌంటర్ వేస్తారు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వెళ్తుంటే.. ఒక అమ్మాయి చదువుకోనని అంటుంటే పెద్దావిడ బ్రతిమిలాడుతుంది. వాళ్ళ దగ్గరికి రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |